Wednesday, August 22, 2018

70 ఏళ్ల వయస్సు ఉన్న బామ్మగా సమంత


70 ఏళ్ల వయస్సు ఉన్న బామ్మగా సమంత




70 ఏళ్ల వయస్సు ఉన్న బామ్మగా సమంత





హైదరాబాద్‌: విభిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయికగా పేరు తెచ్చుకున్నారు సమంత. ప్రస్తుతం ‘యూ టర్న్‌’ చిత్రంతో బిజీగా ఉన్న సమంత త్వరలో కొరియన్‌ సినిమా రీమేక్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కొరియాలో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌గా నిలిచిన ‘మిస్‌ గ్రానీ’ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఇందులో సమంత ప్రధాన పాత్రలో నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం.

ఈ సినిమాకు ప్రముఖ దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. సురేశ్‌బాబు ప్రొడక్షన్స్‌ ఈ సినిమాను నిర్మించనున్నట్లు సమాచారం. దక్షిణ కొరియాకు చెందిన వాంగ్‌ డాంగ్‌ హ్యుక్‌ ‘మిస్‌ గ్రానీ’ సినిమాను తెరకెక్కించారు. ఇదో కామెడీ డ్రామా చిత్రం. 2014లో విడుదలైంది. ఓ 70 ఏళ్ల వృద్ధురాలు స్టూడియోలో ఫొటో తీయించుకుంటుంది. ఆ ఫొటో దిగిన కొన్ని రోజుల తర్వాత అచ్చం తనలాగే ఉన్న 20 ఏళ్ల యువతి కనపడుతుంది. ఆ యువతిని చూసి బామ్మ షాకవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది? అన్నదే ఈ సినిమా కథ.

వినూత్న కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 51.7 మిలియన్‌ డాలర్ల వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా రీమేక్‌లో సమంత నటించనున్నట్లు కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై సామ్‌ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం సమంత ‘యూ టర్న్’, ‘సీమ రాజా’, ‘సూపర్‌ డీలక్స్’ చిత్రాలతో బిజీగా ఉన్నారు.

No comments:

Post a Comment