Saturday, September 15, 2018

అనాగరిక రీతిలో ఓ యువతిపై దాడిచేసి.....ఆ దారుణాన్ని కళ్లకు కట్టే వీడియోతో



అనాగరిక రీతిలో ఓ యువతిపై దాడిచేసి.....ఆ దారుణాన్ని కళ్లకు కట్టే వీడియోతో







దిల్లీ: అనాగరిక రీతిలో ఓ యువతిపై దాడిచేసి.....ఆ దారుణాన్ని కళ్లకు కట్టే వీడియోతో మరో యువతిని  బెదిరించిన రోహిత్‌ సింగ్‌ తోమర్‌(21) అనే యువకుడిని శుక్రవారం  పోలీసులు అరెస్టు చేశారు. అతడు సాక్షాత్తూ దిల్లీలో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్‌పెక్టరుగా ఉన్న అశోక్‌ కుమార్‌ తోమర్‌ అనే పోలీసు ఉద్యోగి కుమారుడు కావడం గమనార్హం.

వైరల్‌ అయిన వీడియో...:  రోహిత్‌ సదరు యువతిపై అత్యంత పాశవికంగా దాడి చేసి...ఆమెను హింసించిన ఘటన  వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఆ యువతిని జుట్టుపట్టుకుని నేలమీద పడేసి ఈడుస్తూ...కాళ్లతో పొట్టలో గట్టిగా కొడుతూ ఆమెకు విపరీతమైన నొప్పి కలిగించేలా అతడు దాడికి తెగబడ్డాడు. ఇదంతా వీడియో తీస్తున్న మరో యువకుడు ‘రోహిత్‌...ఆగు...చాలు..ఆగు’ అంటూ వారిస్తున్న స్వరం కూడా వీడియోలో వినపడుతోంది.

బెదిరించాడు...:  అదే వీడియో చూపి తనను తీవ్ర భయభ్రాంతులకు గురిచేశాడంటూ రోహిత్‌ సన్నిహితురాలిగా పేర్కొంటున్న మరో యువతి వచ్చి ఫిర్యాదు చేయడం అతడి పైశాచికత్వానికి అద్దం పడుతోంది. దీంతో, అతడిపై గురువారం తిలక్‌నగర్‌ పోలీసు స్టేషన్‌లో....శుక్రవారం ఉత్తమ్‌నగర్‌ పీఎస్‌లో వరుసగా కేసులు నమోదైనాయి. మొత్తం మీద బాధితులైన ఇద్దరు యువతుల వ్యధా కలగలిసి దుర్మార్గుడైన రోహిత్‌ సింగ్‌ తోమర్‌ అరెస్టుకు దారితీసింది.
సన్నిహితురాలిని వీడియోచూపి బెదిరించడం ఓ కేసైతే.... రోహిత్‌ తనపై ఇటీవల అత్యాచారం చేశారంటూ అతడి చేతిలో తీవ్రంగా దెబ్బలు తిన్న బాధితురాలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేయడం రెండో కేసు. వీడియోలో ఉన్న యువతిపై భౌతిక దాడి ఘటన మాత్రం దిల్లీ ఉత్తమనగర్‌ ప్రాంతంలో ఈ నెల 2 వతేదీన జరిగినట్లుగా  తెలుస్తోంది. రోహిత్‌ తనను ఓ స్నేహితుడి కార్యాలయానికి పిలిపించి అక్కడ అత్యాచారానికి పాల్పడినట్లు ఆమె ఫిర్యాదు చేసింది.

హోంమంత్రిస్పందన:  ఈ వీడియో చూసిన  కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు. బాధ్యులపై చర్యలు చేపట్టాలంటూ ఆదేశించారు.


No comments:

Post a Comment