Sunday, August 19, 2018

ఇండోనేషియా మరోసారి భూకంపం బారిన




  మరోసారి భూకంపం బారిన ఇండోనేషియా






 రిక్టర్ స్కేలు మీద 6.3గా నమోదు

జకర్తా (ఇండోనేషియా): ఇండోనేషియాను మరోసారి భారీ భూకంపం వణికించింది. ఆ దేశానికి చెందిన లోంబక్‌ ద్వీపంలో ఆదివారం భూకంపం సంభవించింది. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 6.3గా నమోదైంది. యూఎస్‌ జియోలాజికల్ సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు వారాల క్రితం ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించి 460 మంది మరణించిన సంగతి తెలిసిందే. భూకంపం తీవ్రత అధికంగా ఉండటంతో లోంబక్ ప్రాంతంలోని ప్రజలు భయాందోళలకు గురయ్యారు. ‘ఇప్పటికే భూకంపం బారిన పడిన బాధితులకు సరకులు తీసుకెళ్తోన్న సమయంలో ఒక్కసారిగా విద్యుత్ స్తంభం ఊగిసలాడటం కనిపించింది. దీంతో మళ్లీ భూకంపం వచ్చిందని అర్థమైంది’ అని ఓ స్థానికుడు వెల్లడించారు. లోంబక్‌ రాజధాని మతారమ్, బాలి ద్వీపంలో కూడా దీని ప్రభావం కనిపించింది. ఆగష్టు 5న 6.9 మాగ్నిట్యూడ్‌తో సంభవించిన ఈ విపత్తు ఇండోనేషియాను అతలాకుతలం చేసింది. వేల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

No comments:

Post a Comment