ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
కొత్తపేట: హైదరాబాద్ కొత్తపేటలో ఓ ఇంటర్ విద్యార్థిని బలవర్మణానికి పాల్పడింది. శ్రీ చైతన్య మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న అర్చన అనే విద్యార్థిని కళాశాల వసతిగృహంలోని తన గదిలో ఉరి వేసుకుంది. ఇది గమనించిన వసతిగృహం సిబ్బంది కొన ఊపిరితో ఉన్న అర్చనను సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు నిర్ధారించారు. సంస్థాన్ నారాయణపూర్ కు చెందిన అర్చన శ్రీచైతన్య మహిళా జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతూ వసతిగృహంలో ఉంటోంది. రాఖీ పండుగ కోసం సొంతూరుకు వెళ్లిన అర్చన మంగళవారం ఉదయమే వసతిగృహానికి తిరిగొచ్చింది. వసతిగృహంలో ఎవరూలేని సమయంలో తన గదిలో ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. విద్యార్థిని మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుని అమె కుటుంబసభ్యులకు న్యాయం చేయాలని టీఆర్‌ఎస్‌వీ విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
No comments:
Post a Comment