కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం
విశాఖపట్నం:
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో కొన్ని చోట్ల మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు హెచ్చరించారు.

No comments:
Post a Comment