బాక్స్ ఆఫిన్ ను బద్దలు కొట్టనున్నా సైరా నరసింహా రెడ్డి
హైదరాబాద్: అగ్ర కథానాయకుడు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన ‘సైరా: నరసింహారెడ్డి’ టీజర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ టీజర్‌ను 15మిలియన్లకు పైగా వీక్షించారు. టీజర్‌లో చిరు గెటప్, ఆయన పలికిన డైలాగ్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. స్టైలిష్ దర్శకుడిగా పేరుపొందిన సురేందర్‌రెడ్డి బ్రిటిష్ కాలం నాటి కథతో సినిమాను ఎలా తెరకెక్కిస్తారు? అన్న ప్రశ్నకు ఒక్క టీజర్‌తో ‘శెభాష్’ అనిపించుకున్నారు. చిరు ఎంట్రీ, స్వాతంత్ర్యానికి ముందున్న వాతావరణం టీజర్‌లో బాగా చూపించారు.
ప్రముఖ రచయితలు పరుచూరి సోదరులు ‘సైరా’కు కథను అందించిన సంగతి తెలిసిందే. ‘‘టీజర్ చూస్తే చిరంజీవి నటనంతా ఆయన కళ్లలోనే ఉంటుంది. అద్భుతమైన కథకి, అలాంటి సంభాషణలు, సంగీతం, కెమెరా పనితనం ఉంటే విజయం తప్పనిసరి. మేం రాసిన 356 సినిమాలు వచ్చాయి. ఏ సినిమా రాసినందుకు ఆనందంగా ఉందంటే ఓ పదిహేను, ఇరవై సినిమాలు గుర్తుకొస్తాయి. ఏ సినిమా రాసినందుకు గర్వపడుతున్నావంటే మాత్రం ‘సైరా నరసింహారెడ్డి’ పేరు చెబుతా. ఈ సినిమా కోసం 2006లో చిరంజీవితో ప్రయాణం ఆరంభించాం. ఆయన కోసమే 12ఏళ్లు ఆగాం. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేదు. మరి ఎలా తీసుకునేవాళ్లమో తెలియదు. కానీ, ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత సురేందర్‌రెడ్డిలాంటి అద్భుతమైన దర్శకుడు దొరకడం.. అమితాబ్ బచ్చన్, జగపతిబాబులాంటి మంచి నటులు సమకూరడం సినిమాకు ప్రధాన బలం’’ అని అన్నారు.
ఇక ఇందులో మరో డైలాగ్‌ను లీక్ చేస్తున్నానంటూ చెబుతూ.. ‘‘చేతులు వెనక్కి విరిచి కట్టేశాం. ముఖం ముందు ఉరితాడు వేలాడుతోంది. ఏంటిరా? ఆ ధైర్యం.. చావు భయం లేదా నీకు?’ అని అంటే ‘చచ్చి పుట్టినవాడిని.. చనిపోయిన తర్వాత కూడా బతికే వాడిని చావంటే నాకెందుకురా భయం’ అంటూ చిరు డైలాగ్ చెబుతారని గోపాలకృష్ణ అన్నారు. ఈ చిన్న డైలాగ్ మీకోసం లీక్ చేశానని, ఇందుకు చిరంజీవిగారు కోప్పడతారేమో తెలియదన్నారు. కానీ, చిరును మీరు ఎంత ప్రేమిస్తారో ‘ఖైదీ’ నుంచి తానూ అంతే ప్రేమిస్తానని మెగాస్టార్ ఎప్పటికీ మెగాస్టారేనని చెప్పుకొచ్చారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై రామ్‌చరణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘సైరా’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.


No comments:
Post a Comment