తప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ పట్టుబడిన మహిళ వీరంగం- A Women in drunk and drive
హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఓ మహిళ వీరంగం సృష్టించింది. కారు నంబర్ ప్లేట్‌పై జిల్లా రెవెన్యూ అధికారి అని రాసి ఉన్న వాహనంలో వచ్చిన మహిళ ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగింది.
శ్వాస విశ్లేషణ పరీక్షలకు సహకరించకుండా పోలీసులను గంటకుపైగా ఇబ్బంది పెట్టింది. పోలీసులతో దురుసుగా ప్రవర్తించి.. తాను ఐఏఎస్ అధికారి కూతురినంటూ బెదిరించింది. తనకు తెలిసిన వాళ్లతో ఫోన్లు చేయించేందుకు ప్రయత్నించింది.
ట్రాఫిక్ పోలీసులు ఎంతసేపు సర్దిచెప్పినా వినకపోవడంతో చివరికి జూబ్లీహిల్స్ ఠాణా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మహిళా కానిస్టేబుళ్లు వచ్చి ఆమెను పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఆమె వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం నిజంగా జిల్లా రెవెన్యూ అధికారిదేనా అనే కోణంలో ట్రాఫిక్ పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
తనిఖీల దృశ్యాలు చిత్రీకరిస్తున్న ఓ ఛానల్ కెమెరామెన్‌తోనూ ఆ మహిళ వాగ్వాదానికి దిగింది.
6 చోట్ల తనిఖీలు నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు మద్యం సేవించి వాహనాలు నడిపిన 123 మందిపై కేసులు నమోదు చేశారు. వారి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

No comments:
Post a Comment